ఇంద్రకీలాద్రిపై కొండచరియల విరిగిపడిన ఘటనను సమీక్షించామన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
రిపోర్టర్: సునీల్
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ప్రాంగణంలో కొండచరియలు విరిగిపడిన ఘటనపై తక్షణమే స్పందించి పరిస్థితిని సమీక్షించినట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. భక్తులు మరియు ఆలయ సిబ్బంది భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను అప్రమత్తం చేసినట్లు ఆయన వెల్లడించారు.