వెండి ధరల భారీ పతనం: గరిష్ఠాల నుంచి పడిపోయి రెండు లక్షల దిగువకు చేరిక

రిపోర్టర్: విజయ్ స్థలం: హైదరాబాద్

అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిణామాల కారణంగా బంగారం, వెండి ధరలు క్రమంగా పడిపోతున్నాయని నిపుణులు వెల్లడించారు. గరిష్ఠ స్థాయిల నుంచి వెండి ధర సగానికి పైగా క్షీణించి ప్రస్తుతం కిలో రూ.1.9 లక్షలకు చేరిందని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. పశ్చిమాసియా సంక్షోభం, ద్రవ్యోల్బణ భయాలు, వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు ఈ లోహాలపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తున్నాయని విశ్లేషకులు స్పష్టం చేశారు.