ఏపీ లిక్కర్ స్కామ్: ఈడీ కస్టడీకి కీలక నిందితుడు ఈశ్వర్ రెడ్డి

రిపోర్టర్: హరి స్థలం: Hyderabad

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మద్యం రవాణా కుంభకోణం కేసులో ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిని రెండు రోజుల పాటు కస్టడీకి ఇస్తూ హైదరాబాద్ లోని నాంపల్లి ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఈడీ అధికారులు తెలిపారు. లిక్కర్ స్కామ్ ద్వారా వసూలైన కోట్ల రూపాయల ముడుపుల సొమ్మును షెల్ కంపెనీల ద్వారా దారి మళ్లించడంలో ఈయన కీలక పాత్ర పోషించారనే బలమైన ఆరోపణలు ఉన్నట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి.