తెలుగు ఓపెన్ స్కూల్ ద్వారా విద్యను కొనసాగించేందుకు సువర్ణ అవకాశం

రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి స్థలం: ఆత్మకూరు(ఎం)

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. ఎస్ఎస్సీకి పద్నాలుగు సంవత్సరాలు, ఇంటర్మీడియట్ కు పదిహేనేండ్లు నిండినవారు అర్హులని ఆత్మకూరు జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు ఎండి మక్సూద్ అలీ తెలిపారు. ఈనెల ముప్పై వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.