ఉక్రెయిన్పై రష్యా భీకర క్షిపణి దాడి: ఐదు లక్షలకు పైగా ఇళ్లలో కరెంటు బంద్

రిపోర్టర్: విజయ్ స్థలం: Kyiv

రష్యా జరిపిన భారీ క్షిపణి దాడుల గురించి ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్సి కీలక ప్రకటన చేశారు. అంతర్జాతీయ భాగస్వాముల నుంచి తమకు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు అందలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడుల వల్ల పదకొండ ప్రాంతాల్లో పదికి పైగా విద్యుత్ కేంద్రాలు దెబ్బతిన్నాయని, అయిదు లక్షలకు పైగా కుటుంబాలు అంధకారంలోకి వెళ్లాయని ఆయన తెలిపారు. మరోవైపు నిఘా సమాచార పంపిణీ నిలిచిపోలేదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పష్టం చేశారు.