మున్సిపల్ ఎన్నికలు: ఏపీలో ముగిసిన నామినేషన్ల గడువుతో ఉత్కంఠ
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. చివరి రోజైన ఆదివారం అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ అనంతరం బరిలో నిలిచే అభ్యర్థులపై స్పష్టత రానుందని, తదుపరి ప్రచార ఘట్టంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.