గ్రామీణ ప్రాంతాల్లో ఎల్‌పీజీ రీఫిల్ బుకింగ్ గడువు తగ్గింపు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: India

గ్రామీణ ప్రాంతాల్లో ఎల్‌పీజీ గ్యాస్ రీఫిల్ బుకింగ్ గడువును కేంద్ర ప్రభుత్వం 45 రోజుల నుంచి 25 రోజులకు తగ్గించింది. సరఫరా వ్యవస్థ మెరుగుపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి సురేష్ గోపి వెల్లడించారు. ఇకపై పట్టణ, గ్రామీణ ప్రాంతాల వినియోగదారులు అందరూ 25 రోజుల వ్యవధిలోనే సిలిండర్ బుక్ చేసుకోవచ్చు.