విజయనగరం జిల్లాలో పర్యావరణ హితంగా వినాయక చవితి వేడుకలు

రిపోర్టర్: అశోక్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లా వ్యాప్తంగా యువత పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా వినాయక చవితి వేడుకలు జరుపుకుంటోంది. మట్టి విగ్రహాల పంపిణీతో పాటు బాదం పిక్కలు, నవధాన్యాలు, మొక్కజొన్న పొత్తుల గింజలతో విభిన్న రూపాల్లో విఘ్నేశ్వరుడిని తీర్చిదిద్దుతున్నారు. రసాయన విగ్రహాలకు దూరంగా ఉంటూ ప్రకృతి ఆరాధనకు పెద్దపీట వేస్తూ పలు గ్రామాల్లో ఆదర్శంగా నిలుస్తున్నారు.