ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ: సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన ఈసీ
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: న్యూఢిల్లీ
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు సంబంధించిన నిర్ణయాలన్నీ ఎన్నికల సంఘంలోని ముగ్గురు సభ్యులు ఏకగ్రీవంగానే తీసుకున్నారని భారత ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలను తోసిపుచ్చినట్లు డిప్యూటీ ఎన్నికల కమిషనర్ భాను ప్రకాశ్ తెలిపారు. సీఈసీ పనితీరును సవాలు చేస్తూ రాకేశ్ కుమార్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్పై ఈసీ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.