వైద్య రంగంలో చరిత్రాత్మకం: హెచ్ఐవీ నివారణ ఇంజెక్షన్ కు ఎఫ్డీఏ ఆమోదం

రిపోర్టర్: సతీష్ స్థలం: హైదరాబాద్

వైద్య రంగంలో చరిత్రాత్మక పరిణామం చోటుచేసుకుందని డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ సంస్థ సోమవారం వెల్లడించింది. హెచ్ఐవీ వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ఏడాదికి కేవలం రెండు సార్లు మాత్రమే తీసుకునే లెనకాపవిర్ జనరిక్ ఇంజెక్షన్ కు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం తెలిపిందని తెలిపింది. భారత్ కు చెందిన ప్రముఖ ఔషధ సంస్థ ఈ జనరిక్ ఔషధాన్ని అభివృద్ధి చేసిందని, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమారు నూట ఇరవై దేశాలలోని పేద ప్రజలకు తక్కువ ధరకే ప్రాణ రక్షక ఔషధం వేగంగా అందుబాటులోకి వస్తుందని నిపుణులు స్పష్టం చేశారు.