'ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకున్న Telugu Scribe': ప్రత్యేక పూజలు

రిపోర్టర్: కృష్ణ స్థలం: Hyderabad

ఖైరతాబాద్ మహాగణపతిని ప్రముఖులు దర్శించుకున్నారు. మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తదితరులతో పాటు Telugu Scribe వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గణేష్ చతుర్థి శుభాకాంక్షలు తెలిపారు. వినాయక ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భారీగా బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.