నిరుద్యోగులకు గుడ్ న్యూస్: పదివేల పోలీస్ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్

రిపోర్టర్: రాజేష్ స్థలం: Punjab

పంజాబ్ రాష్ట్రంలో పదివేల పోలీస్ ఉద్యోగాల భర్తీకి త్వరలోనే అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ వెల్లడించారు. ఫిల్లౌర్ లోని మహారాజా రంజిత్ సింగ్ అకాడమీలో పోలీసు అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ అక్రమ రవాణాను పూర్తిగా అణచివేయడానికి మరియు శాంతిభద్రతలను పటిష్టం చేయడానికి ఈ కొత్త నియామకాలు ఎంతో దోహదపడతాయని ఆయన స్పష్టం చేశారు.