మాతృభాషను ఎప్పటికీ మరచిపోకూడదు: షాంఘై సాహితీ సదస్సులో వెంకయ్యనాయుడు పిలుపు

రిపోర్టర్: సతీష్ స్థలం: అమరావతి

ప్రపంచంలో ఎక్కడికెళ్లినా మాతృభాష, మాతృభూమి, సంస్కృతి సంప్రదాయాలను ఎప్పటికీ మరచిపోకూడదని పూర్వ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. చైనాలోని షాంఘైలో జరుగుతున్న పదో ప్రపంచ తెలుగు సాహితీ సదస్సునుద్దేశించి ఆయన వర్చువల్గా ప్రసంగించారు. భాష బతికితేనే మన సంస్కృతి బతుకుతుందని, ఇంట్లో పిల్లలతో తెలుగులోనే మాట్లాడుతూ వారికి రాయటం, చదవటం నేర్పించాలని పిలుపునిచ్చారు. విదేశాల్లో తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతున్న ప్రవాసాంధ్రుల సేవలను ఆయన ప్రత్యేకంగా కొనియాడారు.