నాని ది ప్యారడైజ్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథి
రిపోర్టర్: హరి
స్థలం: తెలంగాణ
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని నటిస్తున్న మోస్ట్ అంటెసిపేటెడ్ మూవీ ది ప్యారడైజ్ సినిమా సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న మేకర్స్.. ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ గ్రాండ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మెగాస్టార్ రాకతో సినిమాపై భారీ అంచనాలు పెరిగే అవకాశం ఉంది.