దర్శిలో ఉద్రిక్తత: పోలీసులపై వైఎస్సార్సీపీ శ్రేణుల దాడిలో ఎస్సైకి గాయాలు
రిపోర్టర్: మహేష్
స్థలం: దర్శి
ప్రకాశం జిల్లా దర్శిలో పురపాలక సంఘ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత తలెత్తిందని పోలీసులు తెలిపారు. వైఎస్సార్సీపీ శ్రేణులు నిబంధనలను అతిక్రమించి భారీ ర్యాలీగా వచ్చి పోలీసులపై దాడికి పాల్పడ్డాయి. ఈ ఘర్షణలో ఎస్సై ఏడుకొండలతో పాటు ఒక మహిళా కానిస్టేబుల్కు తీవ్ర గాయాలయ్యాయి. బారికేడ్లను తోసుకుంటూ దూసుకెళ్లిన ఆందోళనకారులను పోలీసులు లాఠీఛార్జి చేసి చెదరగొట్టారు. నామినేషన్ల గడువు ముగియడంతో అభ్యర్థులు వెనుదిరిగారని అడిషనల్ ఎస్పీ యుగంధర్ స్పష్టం చేశారు.