ఖమ్మం కాంగ్రెస్లో పదవుల కేటాయింపులపై మాజీ అధ్యక్షుల తీవ్ర అసంతృప్తి

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం కాంగ్రెస్లో నలభై డివిజన్ల మాజీ అధ్యక్షులు పార్టీ నాయకత్వం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేస్తూ ఏళ్లుగా కష్టపడిన తమను విస్మరించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే తమను చర్చలకు ఆహ్వానించి సముచిత పదవులు కేటాయించాలని కోరుతూ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు.