ఓటర్ల జాబితా పేరుతో సైబర్ మోసాలు: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
రిపోర్టర్: హరి
స్థలం: Kurnool, Andhra Pradesh
ఓటర్ల జాబితా సవరణ పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. అనుమానాస్పద లింకులు, APK ఫైల్స్ క్లిక్ చేయవద్దని, వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలు పంచుకోవద్దని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. ఎటువంటి సందేహాలున్నా నేరుగా మీ ప్రాంతంలోని బూత్ లెవల్ ఆఫీసర్ (BLO)ను సంప్రదించాలని, సైబర్ మోసాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజలకు సూచించారు.