షార్జీల్ ఇమామ్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ కోర్టు
రిపోర్టర్: రమేష్
స్థలం: ఢిల్లీ
ఢిల్లీ అల్లర్ల కేసుకు సంబంధించి యూపీఏఏ చట్టం కింద అరెస్టై జైలులో ఉన్న విద్యార్థి కార్యకర్త షార్జీల్ ఇమామ్‌కు కరకర్‌దుమా కోర్టు అక్టోబర్ 4 నుంచి 10 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తన బంధువు వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వీలుగా కోర్టు ఈ తాత్కాలిక విడుదల ఉత్తర్వులు జారీ చేసింది. 2020 నాటి ఈశాన్య ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో ఆయనపై విచారణ కొనసాగుతోంది.