కడుపునొప్పి భరించలేక పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

రిపోర్టర్: రాము స్థలం: Mulug

మల్హర్ మండలంలోని రుద్రారం గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బడితల ఆరాధ్య అనే పద్దెనిమిదేళ్ల యువతి తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ నయం కాకపోవడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని తండ్రి చంద్రయ్య పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎస్సై మహేందర్ కుమార్ తెలిపారు. బ్యాంక్ పని మీద తల్లిదండ్రులు కాటారానికి వెళ్లి వచ్చేసరికి కూతురు మృతి చెంది ఉండటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయని, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు.