సినీ రంగంలో నలభై ఎనిమిదేళ్ల ప్రయాణం పూర్తి చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి

రిపోర్టర్: సునీల్ స్థలం: హైదరాబాద్

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సినీ రంగ ప్రవేశం చేసి నేటితో సరిగ్గా 48 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఆయన నటించిన తొలి చిత్రం ప్రాణం ఖరీదు 1978 సెప్టెంబర్ 22న విడుదలైంది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా చిరంజీవి స్పందిస్తూ.. ఆ రోజు తాను పెట్టుకున్న చిరంజీవి అనే పేరు నేడు తనకు ప్రేక్షకులు అందించిన శాశ్వత గుర్తింపుగా మారిందని ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు.