వాహనదారులకు గుడ్ న్యూస్: రూ.15 లక్షలలోపు టాప్ 10 సేఫెస్ట్ కార్లు ఇవే
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
కొత్త కారు కొనుగోలు చేసేవారికి భద్రతపై అవగాహన పెరుగుతున్న తరుణంలో, ఆటోమొబైల్ రంగ నిపుణులు రూ.15 లక్షల బడ్జెట్ లో లభించే పది ఉత్తమ కార్ల వివరాలను వెల్లడించారు. భారత్ మరియు గ్లోబల్ ఎన్‌సిఎపి క్రాష్ టెస్టులలో ఐదు స్టార్ రేటింగ్ సాధించిన టాటా పంచ్, ఆల్ట్రోజ్, నెక్సాన్, మారుతి డిజైర్, మహీంద్రా ఎక్స్‌యూవీ త్రీఎక్స్ఓ, స్కోడా కైలాక్ వంటి మోడల్స్ కుటుంబ ప్రయాణాలకు అత్యంత సురక్షితమైనవిగా నిలిచాయని ఆటో పరిశ్రమ వర్గాలు స్పష్టం చేశాయి.