ఇండీ కూటమి మాక్ పార్లమెంట్ పై సంబిత్ పాత్ర తీవ్రస్థాయిలో ఆగ్రహం

రిపోర్టర్: రాజేష్ స్థలం: New Delhi

ఎన్నికల సంఘంపై ప్రతిపక్షాల ఆరోపణలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ సంబిత్ పాత్ర స్పష్టం చేశారు. ఇండీ కూటమి నిర్వహించిన మాక్ పార్లమెంట్ కార్యక్రమం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ఆయన మండిపడ్డారు. ఓటమిపాలవుతున్న ప్రతిపక్షాలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఇటువంటి డ్రామాలకు తెరతీస్తున్నాయని, నిరాధార ఆరోపణలతో రాజ్యాంగ సంస్థలపై అనుమానాలు రేకెత్తించే నాటకాలను రాహుల్ గాంధీ వెంటనే మానుకోవాలని ఆయన తీవ్రంగా హితవు పలికారు.