ఘజియాబాద్ అపార్ట్మెంట్ లిఫ్ట్ లో వ్యక్తి మూత్ర విసర్జన
రిపోర్టర్: గోపి
స్థలం: Ghaziabad
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్‌లోని ఇందిరాపురం అహింసా ఖండ్-1 ప్రాంతంలోని షిప్రా కృష్ణ విస్టా సొసైటీలో దారుణ ఘటన వెలుగు చూసింది. అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లో దుర్వాసన వస్తుండటంతో నివాసితులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా, ఓ యువకుడు లిఫ్ట్ కంట్రోల్ ప్యానెల్ వద్ద మూత్ర విసర్జన చేస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.