ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి అనర్హుడంటూ కర్నే ప్రభాకర్ ఫైర్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Hyderabad

22ఎ నిషేధిత జాబితాపై ప్రజల్లో ఉన్న తీవ్ర ఆగ్రహం నుంచి దృష్టి మళ్లించేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కేసీఆర్ భూముల గురించి ప్రస్తావించారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ మండిపడ్డారు. ప్రజల పక్షాన బీఆర్ఎస్ నిలదీస్తుందనే భయంతోనే కేసీఆర్‌ను రేవంత్ టార్గెట్ చేశారని, ఆయన సీఎం పదవికి పూర్తిగా అనర్హుడని ఘాటు విమర్శలు చేశారు.