రైతన్నల కంటితడికి కారణమవుతున్న విద్యుత్ తీగల చోరీలు

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: నగరి

నగరి మున్సిపల్ పరిధిలోని వ్యవసాయ పొలాల వద్ద విద్యుత్ సామగ్రిని లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ఘటనలు రైతుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. నగరి పరిధిలోని టీఆర్ కండ్రిగ వద్ద ఒక్క రోజులోనే ముగ్గురు రైతులకు సంబంధించిన విద్యుత్ తీగలను దుండగులు కత్తిరించి ఎత్తుకెళ్లారు. ఒక్కో రైతు ఈ వైర్ల కొరకు పది వేల రూపాయలు ఖర్చు చేశారు. వ్యవసాయం చేస్తే వచ్చే ఆదాయం అంతంత మాత్రమే ఉంటే ఇలా విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్లు, స్టార్టర్లు అంటూ వచ్చే నష్టాలను ఎలా భరించాలని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.