నూజివీడులో మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: Nuzvid, Andhra Pradesh

నూజివీడులో ఉద్రిక్తత నెలకొంది. అప్పారావు కాలనీ ఆర్చిపై మంత్రి కొలుసు పార్థసారథి పేరు ఉండటాన్ని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఆ పేరును వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలుపుతుండగా, పోలీసులు ప్రతాప్ అప్పారావును అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో స్థానికంగా రాజకీయ వేడి పెరిగింది.