రాజాంలో దారుణం: విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసు వీలు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లా రాజాంలో కలకలం రేపిన విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ లలిత కుమారి హత్య కేసును పోలీసులు ఛేదించారు. భార్య ప్రవర్తనపై అనుమానంతోనే ఆమె భర్త సీతారామరాజు గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేసినట్లు రాజాం టౌన్ పోలీసులు వెల్లడించారు. బస్టాప్ వద్ద దింపుతానని నమ్మించి శ్మశాన వాటిక సమీపంలోకి తీసుకెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని, డాగ్ స్క్వాడ్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు అధికారులు తెలిపారు.