ఏపీ మున్సిపల్ ఎన్నికలకు ఈవీఎంల వినియోగం: జీవో జారీ
రిపోర్టర్: హరి
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం జీవో నెం. 211 జారీ చేసింది. ఈ ఎన్నికల్లో బ్యాలెట్ పద్ధతికి బదులుగా ఈవీఎంలను వాడనున్నట్లు స్పష్టం చేసింది. జనరల్ అభ్యర్థులకు రూ. 5,000, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ. 2,500 నామినేషన్ డిపాజిట్‌గా నిర్ణయించారు. అభ్యర్థులు తమ నేర చరిత్ర, ఆస్తులు, విద్యార్హతల వివరాలతో కూడిన అఫిడవిట్‌ను తప్పనిసరిగా సమర్పించాలని నిబంధనలను కఠినతరం చేసింది.