అనంతపురంలో వైకాపా అరాచకాలపై ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: శివ
స్థలం: అనంతపురం
అనంతపురం నగరంలో మున్సిపల్ ఎన్నికల విజయం తర్వాత వైకాపా నాయకులు పాల్పడుతున్న దాడులపై అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన స్వయంగా పరామర్శించి ధైర్యం చెప్పారు. గెలుపు అహంకారంతో మహిళలని కూడా చూడకుండా ఇళ్లలోకి చొరబడి దౌర్జన్యాలకు దిగుతున్నారని, ఈ అరాచకాలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు.