జామిలో నిలిచిపోయిన రోడ్డు పనులు: ప్రమాదకరంగా మారిన వైనంపై తీవ్ర ఆవేదన

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: విజయనగరం

జామి మండలంలోని యాతపాలెం నుంచి చెరువులోకి వెళ్లే రహదారి నిర్మాణం మధ్యలోనే నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోటి రూపాయలతో శంకుస్థాపన చేసినా పనులు పూర్తి చేయకపోవడంతో రోడ్డు పిక్కలు తేలి ప్రమాదకరంగా మారిందని వాపోతున్నారు. తారు ధర పెరగడం వల్లే పనులు నిలిచాయని, త్వరలోనే పునరుద్ధరిస్తామని పీఆర్ ప్రాజెక్టు ఏఈ మానస స్పష్టం చేసినట్లు ప్రజలు తెలిపారు.