'డిమాండ్ అంచనాలు తప్పు': విజయవాడలో సీఈఏ మాస్టర్ ప్లాన్‌పై అధికారుల అభ్యంతరం
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: విజయవాడ
విజయవాడలో దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ అధికారులతో జరిగిన సమావేశంలో కేంద్ర విద్యుత్ సంస్థ (సీఈఏ) మాస్టర్ ప్లాన్ అంచనాలపై రాష్ట్ర అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. 2036-37 నాటికి విద్యుత్ వినియోగం 1.74 లక్షల ఎంయూలకు చేరుతుందని సీఈఏ అంచనా వేయగా, డేటాసెంటర్లు, గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టులకు సంబంధించిన విద్యుత్ డిమాండ్ లెక్కల్లో తేడాలున్నాయని అధికారులు స్పష్టం చేశారు. ఈ అంచనాలపై సమగ్ర వివరాలు పంపిస్తే మాస్టర్‌ప్లాన్ సవరించి పంపిస్తామని సీఈఏ అంగీకరించింది.