వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని మంత్రి పయ్యావుల వెల్లడి
రిపోర్టర్: శివ
స్థలం: దిల్లీ
దిల్లీలో జరిగిన వికసిత భారత్ సదస్సులో ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి చేయడంపై దృష్టి సారించినట్లు ఆయన వెల్లడించారు. రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు త్వరలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ప్రకృతి వ్యవసాయాన్ని 18 లక్షల ఎకరాలకు విస్తరించామని, ఈ-క్రాప్ బుకింగ్‌ను శాటిలైట్ మ్యాపింగ్‌తో అనుసంధానిస్తున్నామని తెలిపారు.