రోజుకు మూడు కప్పుల కాఫీ తాగితే ఆరోగ్యానికి ప్రమాదమా
రిపోర్టర్: రాము
స్థలం: హైదరాబాద్
ఉదయాన్నే మూడు కప్పుల కాఫీ తాగడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయని యశోద హాస్పిటల్స్ చీఫ్ డైటీషియన్ డాక్టర్ సుజాత స్టీఫెన్ తెలిపారు. ఖాళీ కడుపుతో కెఫిన్ తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ యాసిడ్ తయారై కడుపులో మంట, అసిడిటీ సమస్యలు పెరుగుతాయని ఆమె పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన పెద్దవారికి రోజుకు నాలుగు వందల మిల్లీగ్రాముల కెఫిన్ సురక్షితమైన పరిమితి అని, అయితే గర్భిణులు, బీపీ బాధితులు కాఫీ సేవించేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని ఆమె సూచించారు.