ఆలేరు పరిసరాల్లో యథేచ్ఛగా సాగుతున్న అక్రమ ఇసుక రవాణా

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఆలేరు

ఆలేరు మండలం కొలనుపాక నుంచి రాజపేట మీదుగా నారాయణపురం గ్రామానికి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. అధికారుల కన్నుకప్పి జనావాసాలు లేని మార్గాలను ఎంచుకుని ఇష్టానుసారంగా ఇసుక రవాణా చేస్తున్నట్లు గ్రామస్తులు వెల్లడించారు. నిబంధనలను ఉల్లంఘించి సాగుతున్న ఈ అక్రమ రవాణాపై అధికారులు తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు తీవ్రంగా కోరుతున్నారు.