సిద్దిపేట జిల్లాలో అనుమతులు లేని నాటు వైద్యశాల సీజ్
రిపోర్టర్: మహేష్
స్థలం: సిద్దిపేట
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు, వైద్య విద్యార్హతలు లేకుండా విరిగిన ఎముకలకు అల్లోపతి మందులతో నాటు వైద్యం అందిస్తున్న ధన్వంతరి ఎముకల దవాఖానను అధికారులు శుక్రవారం సీజ్ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో మీర్జాపూర్ పీహెచ్‌సీ వైద్యాధికారి శ్రీనివాస్, తహసీల్దార్ ఎల్. లక్ష్మారెడ్డి, ఎస్ హెచ్ ఓ లక్ష్మారెడ్డి తనిఖీలు నిర్వహించి మందులు స్వాధీనం చేసుకున్నారు.