దస్తురాబాద్ మండల కేంద్రంలో ఘనంగా వీబిజి రాంజీ పథక గ్రామ సభ
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: దస్తురాబాద్
నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ గోపాల్ ఆధ్వర్యంలో వీబిజి రాంజీ పథకంపై గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులపై చర్చించి, వాటికి సంబంధించిన తీర్మానాలను ఆమోదించారు. గ్రామ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను చేపట్టేందుకు ప్రాధాన్యత క్రమాన్ని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో పాలక వర్గ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి చంద్ర శేఖర్, గ్రామస్తులు పాల్గొన్నారు.