గ్లోబల్ చెస్ లీగ్‌లో కార్ల్సన్‌కు తొలి ఓటమి
రిపోర్టర్: కిరణ్
స్థలం: కర్ణాటక
బెంగళూరులో జరుగుతున్న గ్లోబల్ చెస్ లీగ్‌లో ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్సన్‌కు తొలి ఓటమి ఎదురైంది. ట్రివెని కింగ్స్ గ్రాండ్‌మాస్టర్ అలీరెజా ఫిరోజ్జా అద్భుత ఆటతీరుతో కార్ల్సన్‌ను ఓడించి సంచలనం సృష్టించారు. 49 వేశాల సుదీర్ఘ పోరులో నల్లని పావులతో ఆడిన అలీరెజా దూకుడు ప్రదర్శించి ఈ టోర్నీలో తన మొదటి విజయాన్ని నమోదు చేశారు. ఈ విజయంతో కార్ల్సన్ జట్టు ట్రివెని కింగ్స్ చేతిలో పరాజయం చవిచూసింది.