వైసీపీ సమావేశంలో కంటతడి పెట్టిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ

రిపోర్టర్: గోపి స్థలం: ఆంధ్రప్రదేశ్

వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. గుడివాడ అమర్నాథ్ ప్రసంగిస్తున్న సమయంలో బొత్స ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు. ఇటీవల ఆయన మేనల్లుడు టీడీపీలో చేరడం, స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహకాల నేపథ్యంలో ఈ ఘటన ప్రాధాన్యత సంతరించుకుంది. అక్కడున్న నేతలు ఆయనను ఓదార్చారు.