భారీ వర్షాల కారణంగా భద్రాద్రి జిల్లాలో స్కూళ్లకు సెలవు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: భద్రాద్రి కొత్తగూడెం

తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికలరీత్యా విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. రాబోయే గంటల్లో మరికొన్ని జిల్లాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెదర్మ్యాన్ అంచనా వేశారు.