ఏకగ్రీవ విజయంతో సిద్ధేశ్వరస్వామికి 108 కొబ్బరికాయలు సమర్పించిన టీడీపీ నాయకులు

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: సీతారామపురం

స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవ విజయం సాధించిన సందర్భంగా సీతారామపురం మండల టీడీపీ కన్వీనర్ చింతల శ్రీనివాసులు మరియు ఎంపీపీ అభ్యర్థి చింతల కళావతి గురువారం గుటిక సిద్ధేశ్వరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో 108 కొబ్బరికాయలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.