ఒమన్ తీరంలో కార్గో నౌకపై దాడి: గుజరాత్ నావికుడు దుర్మరణం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: గుజరాత్
మధ్యప్రాచ్య యుద్ధం వేళ ఒమన్ తీరం వెంబడి ప్రయాణిస్తున్న భారతీయ కార్గో నౌకపై గుర్తుతెలియని వస్తువుతో జరిగిన దాడిలో గుజరాత్ కు చెందిన నావికుడు గంధర్ నహిమ్ అజిజ్ ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ వెల్లడించారు. నౌకలో ఉన్న మరో పదమూడు మంది సిబ్బందిని ఒమన్ కోస్ట్ గార్డ్ రక్షించినట్లు తెలిపారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.