సమస్యల పరిష్కారం కోరిన మాజీ ఉపసర్పంచ్
రిపోర్టర్: SINDERI KAMESH
స్థలం: జి.కె.వీధి
రింతాడ గ్రామంలో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మాజీ ఉపసర్పంచ్ మడపల సోమేశ్ కుమార్ సోమవారం రింతాడ సచివాలయంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు.
ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలోని రహదారిపై స్కూల్జోన్ బోర్డు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని, స్మశానవాటిక పునరుద్ధరణతో పాటు పెండింగ్ ఇళ్ల బిల్లులు చెల్లించాలని కోరారు.