జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం ఉరుములా గర్జించిన సోమయ్య

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

జర్నలిస్టుల హక్కులు మరియు సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతామని టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య అన్నారు. కుత్బుల్లాపూర్ మహాసభలో మాట్లాడుతూ ఇళ్ల స్థలాలు, అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డుల సాధనకు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అనంతరం అంగూరు గోవిందరావు అధ్యక్షుడిగా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా జర్నలిస్టుల సమస్యలపై చర్చించి కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు.