గ్రేటర్ నోయిడాలో థార్ కారు బీభత్సం సుప్రీంకోర్టు లాయర్ మృతి
రిపోర్టర్: విజయ్
స్థలం: ఉత్తరప్రదేశ్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గ్రేటర్ నోయిడాలోని బిస్రాఖ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం వేగంగా దూసుకొచ్చిన మహీంద్రా థార్ కారు స్కూటర్‌ను ఢీకొట్టింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో సుప్రీంకోర్టు లాయర్ నీరజ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆయన భార్య తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్న డ్రైవర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.