పిల్లల మౌనం వెనుక దాగున్న తీవ్ర ఆందోళనల వైనం
రిపోర్టర్: అశోక్
స్థలం: Bengaluru
పాఠశాల నుండి ఇంటికి వచ్చే పిల్లలు మాట్లాడకుండా మౌనంగా ఉంటే వారి మనసులో తీవ్ర ఆందోళనలు ఉన్నాయని అపోలో ఆసుపత్రి సీనియర్ క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ సుగామి రమేష్ తెలిపారు. పిల్లలు తమ సమస్యలను తల్లిదండ్రులకు చెప్పడానికి భయపడుతుంటారని, వారి ప్రవర్తనలో వచ్చే మార్పులను గుర్తించి ప్రేమతో మాట్లాడాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలకు ఎలాంటి ఒత్తిడి లేకుండా సురక్షితమైన వాతావరణం కల్పించి వారి భావాలను అర్థం చేసుకోవాలని యునిసెఫ్ కూడా స్పష్టం చేసింది.