శరన్నవరాత్రి వేడుకలు: ఖమ్మం రజక వీధిలో వైభవంగా అన్నపూర్ణాదేవి పూజలు
రిపోర్టర్: ఆముదాల వెంకన్న
స్థలం: ఖమ్మం అర్బన్
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముప్పై ఆరో డివిజన్ రజక వీధిలో మెగా డైమండ్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం అమ్మవారిని అన్నపూర్ణాదేవి రూపంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు బచ్చు విజయ్ కుమార్ తో పాటు పలువురు నాయకులు, భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.