మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు: అమెరికా పౌరులకు కొత్త భద్రతా హెచ్చరిక జారీ

రిపోర్టర్: హరి స్థలం: హైదరాబాద్

మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం పౌరుల కోసం తాజాగా ఒక కీలక భద్రతా హెచ్చరిక జారీ చేసినట్లు విదేశాంగ శాఖ అధికారులు వెల్లడించారు. ఇరాన్ దేశం అలాగే దానికి మద్దతు ఇస్తున్న వివిధ వర్గాలు అమెరికా ప్రయోజనాలను, పౌరులను ప్రపంచవ్యాప్తంగా లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సౌదీ అరేబియా విమానాశ్రయాలపై డ్రోన్ దాడులు జరగడంతో విమాన సర్వీసులు నిలిచిపోయాయి.