టేకులపల్లిలో ఘనంగా శ్రీ గణేష్ అన్నదాన కార్యక్రమం
రిపోర్టర్: amudala Venkanna
స్థలం: ఖమ్మం అర్బన్
ఖమ్మం నగరంలోని 7వ డివిజన్ టేకులపల్లి శ్రీలక్ష్మీనగర్ కాలనీలో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ రెబల్ యూత్ ఆధ్వర్యంలో అన్న వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ వేడుకలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.