కూతురి పెళ్లి వేదిక మార్పుపై వైఎస్ షర్మిల తీవ్ర ఆవేదన

రిపోర్టర్: శివ స్థలం: విజయవాడ

ఆస్తుల వివాదాల నేపథ్యంలో తన కుమార్తె అంజిలి రెడ్డి వివాహ వేదికను మారుస్తున్నట్లు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రకటించారు. బెంగళూరులోని యలహంక నివాసంలో జరగాల్సిన ఈ పెళ్లిని వేరే ప్రాంతానికి మారుస్తున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నాది కాని ఆస్తి కోసం ఆశపడే నీచత్వం నాది కాదని, ఆ ఆస్తి పూర్తిగా తన పిల్లల భాగంలోకే వచ్చిందని షర్మిల స్పష్టం చేశారు.