మధుమేహ బాధితులు దృష్టిని కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన పోషకాహారం

రిపోర్టర్: నరేష్ స్థలం: తెలంగాణ

మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడమే కంటి చూపును కాపాడుకోవడానికి అత్యంత కీలకమని డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ కంటి వైద్య నిపుణులు డాక్టర్ దీపక్ బి తెలిపారు. రక్తంలో షుగర్ లెవల్స్ దీర్ఘకాలం ఎక్కువగా ఉండటం వల్ల రెటీనాలోని సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతింటాయని, దీనినే డయాబెటిక్ రెటినోపతి అంటారని ఆయన పేర్కొన్నారు. సరైన పోషకాహారాన్ని తీసుకోవడం ద్వారా ఈ రక్తనాళాలను బలోపేతం చేసుకోవచ్చని, ఆకుకూరలు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉండే చేపలు, రంగురంగుల కూరగాయలు డైట్లో చేర్చుకోవాలని వైద్యులు స్పష్టం చేశారు.